
కానీ ఫలితం లభించలేకపోయింది. ఆయన మెదడు పూర్తిగా డామేజ్ అయినది.. గుండెపోటు రావడం వల్ల శరీరంలోని పలు అవయవాలు కూడా తమ పనితీరును నిలిపివేశాయని.. ఫలితంగా ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు, అభిమానులు, ప్రజలు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న మరణ వార్త విని ఎమోషనల్ కామెంట్లు చేశారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.
సాయి ధరంతేజ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా..తారకరత్న అన్న మరణించారన్న వార్త నా హృదయాన్ని పూర్తిగా గాయపరిచింది.. ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లాల్సిన అవసరం మీకు ఉందా? అని అనిపిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలి అని నేను కోరుకుంటున్నాను.. ఆయన లేని ఇండస్ట్రీ పూర్తిగా అనాధ అయిపోయింది.. ఆయన ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలి.. ఓం శాంతి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సాయి ధరంతేజ్. సాయి ధరంతేజ్ తో పాటు చిరంజీవి , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.