యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.. ఈ సినిమా చాలా డిఫరెన్స్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి నిన్నటి రోజున రావడం జరిగింది. దాదాపుగా కిరణ్ అబ్బవరం సక్సెస్ సాధించగా చాలాకాలం అవుతోంది. అయినప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు కిరణ్ అబ్బవరం. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో బాగా దూసుకుపోతోంది ఇక కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.


వినరో భాగ్యము విష్ణు కథ సినిమా మొదటి రోజే దాదాపుగా రూ.2.7 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. శివరాత్రి కావడం వల్ల ఈ సినిమా నిజంగానే బాగుందో తెలియదు కానీ వసూళ్లపరంగా అయితే బాగానే రాబట్టింది చాలామంది ఈ సినిమా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు. రివ్యూల పరంగా కూడా బాగానే రావడంతో మౌత్తుటాకు కూడా బాగుండడంతో ఈ సినిమా సక్సెస్ కొట్టినట్లు కిరణ్ అబ్బవరం అన్నట్లుగా తెలుస్తోంది. 2021 లో విడుదలైన S.R.కళ్యాణ మండపం సినిమా కూడా భారీగానే వసూళ్లను సాధించింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కించడంతో ఈ సినిమా కూడా మొదటి రోజు రూ.2.6 కోట్లు వసూలు చేపట్టగా..


వినరో భాగ్య విష్ణు కథ చిత్రం S.R.కళ్యాణ మండపం సినిమా కంటే లక్ష రూపాయలు ఎక్కువగా రాబట్టింది. అయితే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా ఎంతటి కలెక్షన్లు రాబడుతుందో అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయి కిరణ్ అభవరానికి ప్లస్ గా మారుతుంది చూడాలి మరి. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని బన్నీ వాసు నిర్మాతగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: