పవన్ త్రివిక్రం ల మధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. వారిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే కచ్చితంగా రికార్డులు బద్ధలు అవ్వాల్సిందే. పవన్ చేస్తున్న ప్రతి సినిమాకు త్రివిక్రం హ్యాండ్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ చేసే రీమేక్ ల పై త్రివిక్రం హెల్ప్ అందరికి తెలిసిందే. వకీల్ సాబ్ తప్ప పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమాకు త్రివిక్రం రచనా సహకారం ఉండాల్సిందే. ఇక లేటెస్ట్ గా పవన్ కోసం మరో రీమేక్ రెడీ అయ్యింది. కోలీవుడ్ లో సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదయ సీతం ని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

మాతృక దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు డైలాగ్స్ కోసం ముందు సాయి మాధవ్ బుర్రని అనుకోగా ఇప్పుడు ఆయన ప్లేస్ లో మళ్లీ త్రివిక్రం నే తీసుకున్నారని టాక్. పవన్ రీమేక్ సినిమా అనగానే త్రివిక్రం ప్రత్యక్షమవడం కామనే. కానీ వినోదయ సీతం సినిమా కు ముందు సాయి మాధవ్ ని అనుకోగా.. ఆయన ఖాళీ లేకపోవడం వల్ల త్రివిక్రం తోనే డైలాగ్స్ రాస్యిస్తున్నారట.

పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని తెలిసిందే. ఆల్రెడీ తెలుగులో నటుడిగా కొనసాగుతున్న సముద్రఖని డైరెక్టర్ గా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ఆయన చేసిన శంబో శివ శంబో సినిమా ఇక్కడ మంచి ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. వినోదయ సీతం సినిమా పవన్, సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ ని అలరిస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు చేస్తుండగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో పెట్టాడు. దానితో పాటుగా సుజిత్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: