
పదేళ్ల నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో సూపర్ హిట్ విజయాలతో దూసుకుపోతున్న పరిణీతి చోప్రా ఇప్పుడు చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా 34 సంవత్సరాల కు చెందిన ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సింగల్ గానే ఉన్నాను.. మింగిల్ కావాలని అనుకుంటున్నాను.. బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్లు, ఆ ఫోటోలు చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. వాళ్లంతా నా స్నేహితులే.. అలా పెళ్లి చేసుకుంటుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది.
ప్రస్తుతం నేను ఎవరితోనూ ప్రేమలో లేను .. నేను ఎవరితో అయినా ప్రేమలో పడినప్పుడు అతడినే పెళ్లి చేసుకుంటాను.. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా నేను సిద్ధమే.. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి అంటూ అభిమానులను కోరింది.. దీంతో పరిణీతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి కొంతమంది మమ్మల్ని పెళ్లి చేసుకో అంటూ చాలా ప్రపోజల్స్ కూడా పెడుతున్నారు. మరి ఈ పంజాబీ భామ ఎప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటుందో చూడాలి.