
అయితే దానికి సరైన ఆన్సర్ మారుతి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ముహుర్తం కూడా సీక్రెట్ గా నిర్వహించి షూటింగ్ కూడా అంతా సైలెంట్ గా చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా సినిమా సెట్స్ నుంచి మారుతి ఒక పిక్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో ప్రభాస్ లేడు కానీ మారుతి మాత్రం ఒక పాత ఇంటి తరహా సెట్ లో బ్లాక్ అండ్ వైట్ లైట్ లా కనిపించేలా ఫోటో వదిలారు. చూస్తుంటే మారుతి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అర్ధమవుతుంది.
ప్రభాస్ తో సాహసం చేస్తున్న మారుతి తన మార్క్ కామెడీతో పాటుగా ప్రభాస్ రేంజ్ ఎలివేషన్స్ కూడా సినిమాలో ఉండేలా చూస్తున్నాడట. సో ఎలా చూసినా మారుతి ప్రభాస్ రాజా డీలక్స్ అని ప్రచారంలో ఉన్న ఈ సినిమా తో మారుతి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్, మాళవిక రొమాన్స్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. సినిమాపై ప్రభాస్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడని.. మారుతిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పినట్టు టాక్.