నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బాలకృష్ణ ఇప్పటికే అఖండ ... వీర సింహా రెడ్డి అనే రెండు విజయ వంతమైన మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడం తో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని ఈ చిత్ర బృందం ఎన్ బి.కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ కెరియర్ లో సూపర్ హిట్ సాంగ్ లలో అందాల ఆడబొమ్మ అనే సాంగ్ ఒకటి. ఈ సాంగ్ కు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా ప్రేక్షకుల నుండి ఇప్పటికి కూడా మంచి ఆదరణ అందుకుంటున్న ఈ సాంగ్ ను ఎన్ బి కే 108 మూవీ లో రీమిక్ చేసి పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. నిజంగానే ఈ సాంగ్ ను కనుక ఈ మూవీ లో పెట్టినట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: