తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ ప్రస్తుతం దమ్కీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పాగల్ అనే మూవీ లో నటించారు.

సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి కెమిస్ట్రీ కి కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకులకు నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇలా ఇప్పటికే మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ మరో సారి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను కూడా క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నైజాం ఏరియా బిజినెస్ ను క్లోజ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా హక్కులను 4 కోట్లకు ఒక ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న దమ్కీ మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: