ప్రభాస్ ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రభాస్ ఆఖరుగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాదే శ్యామ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోవడంలో చాలా వరకు విఫలం అయింది.

అలా రాదే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ బడ్జెట్ మూ వీలలో హీరోగా నటిస్తున్నాడు. అలా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీలలో ప్రాజెక్ట్ కే మూవీ ఒకటి. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం  వహిస్తూ ఉండగా ... ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ... వైజయంతి  మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో బిగ్ బి అమితా బచ్చన్ ... దిశా పటాని ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్.లో పాల్గొన్న అమితా బచ్చన్ కు గాయాలు అయ్యాయి. అనంతరం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే ఈ లోపు ఇతర నటీనటులపై చిత్రీకరణ కొనసాగించి సినిమాను అనుకున్న తేదీనే విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: