తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోయిన్ పాత్రలలో మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న పూర్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పూర్ణ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర పాత్రల్లో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

అలాగే కొంత కాలం క్రితం త్రీ రోజెస్ అనే పెప్ సిరీస్.లో కీలక పాత్రలో నటించి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా తనకంటూ ఒక క్రేజీ ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పూర్ణ "అఖండ" అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లోని పూర్ణ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్.లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో గ్రీన్ కలర్ లో ఉన్న అల్ట్రా స్టైలిష్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: