బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించిన షారుక్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న షారుక్ తాజాగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది.ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంగీత దర్శకుడు ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ను మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిరుద్ ఈ మూవీ కి ఇచ్చిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: