టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఎంతో వైరల్ అవుతుంది. దానికి కారణం నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడమే. ఈ జంట విడిపోయినప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు  ఎక్కడ ఏం మాట్లాడుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ హీరోలు మీడియాలో వీళ్ళ గురించి మాట్లాడింది లేదు. ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నాగచైతన్య తాజాగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది. 

చైతు ఎప్పటినుంచో సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన అభిరుచికి తగ్గట్టు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి అందులో తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకున్నాడు. తాజాగా చైతు తన కొత్త ఇంట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎటువంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా కొత్త ఇంట్లోకి దిగిన చైతు.. ఈ ఇంటిని నిర్మించుకోవడం వెనక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. సమంతతో విడాకులు తీసుకున్నప్పటినుంచి తన తండ్రి నాగచైతన్యతో చైతుకు కొంచెం గొడవలు అవుతున్నాయట. అందుకే చైతూ ఇప్పుడు సింగిల్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట. చైతుకు సినిమాలపరంగా తన తండ్రి నాగార్జున నుంచి ఎటువంటి హెల్ప్ అందడం లేదట.

అందుకే చైతు తన సొంత నిర్ణయాలతో ఇంటికి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఈ విషయం వైరల్ అవ్వడంతో ఇది తెలిసి చైతు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చైతు ఇప్పుడు అందరికీ దూరమై ఒంటరివాడు అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా.. టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: