మోస్ట్ టాలెంటెడ్ అండ్ బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంత మైన మూవీ లతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బాలీవుడ్ స్టార్ హీరో  పఠాన్ అనే భారీ యాప్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే షారుక్ సరసన హీరోయిన్ గా నటించగా ... సిద్ధార్థ్ ఆనంద్మూవీ కి దర్శకత్వం వహించాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ కలక్షన్ లను రాబడుతున్న ఈ మూవీ మరీ ముఖ్యంగా హిందీ పరిశ్రమలో మాత్రం సాలిడ్ కలెక్షన్ లను ఇప్పటికి కూడా రాబడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే పఠాన్ మూవీ హిందీ పరిశ్రమలో 522.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న షారుక్ కు కూడా ఈ మూవీ అదిరిపోయే కం బ్యాక్ ను తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: