జనానికి ఆయనంటే పిచ్చి. ఆయన్ని మానవ రూపంలో ఉన్న దేవుడిలా జనాలు కొలుస్తారు. ఎందుకంటే ఆయన పేదల కష్టాలు చూస్తే ఇట్టే కరిగిపోతాడు. ఏ మనిషికి అయిన సమస్య ఉందని తెలిస్తే చాలు.. వారి ఇంటిని వెతుక్కుంటూ వస్తాడు. ఆయనకు దేవుడు ఇచ్చినదాంట్లో పేదలకు ఇచ్చి కన్నీళ్లు తుడిచి వారి కష్టం తీరేవరకు వెంటే ఉంటాడు. సమస్యను గట్టెక్కించి వారి భవిష్యత్తును మార్చడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు. ఇది సినిమాల్లో విలన్‌ పాత్రలు వేస్తూ కనిపించే ఓ రియల్‌ హీరో కథ. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు ఆయనెవరో బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఆయనకున్న ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌, క్రేజ్ ఈ మూడు ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకు కూడా లేదు.సాయం అనేది పలకడానికి కేవలం చిన్న పదమే అయినా దానికి చాలా పెద్ద మనసు అనేది కావాలి. నూటికో కోటికో ఒకరికి అలాంటి పెద్ద మనసనేది ఉంటుంది. విలన్ గా సినిమాల్లో పాత్రలు వేసినా..రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు ఈ మనిషి. సాయం అంటూ వచ్చినవారిని వెనక్కి పంపిన దాఖలాలు అస్సలు లేవు. వామ్మో కేవలం ఒకరా ఇద్దరా..ఎందరికో వందలమందికి ఆపద్భాంధవుడయ్యాడు ఈ విలన్. ఆయనెవరో అందరికి తెలుసు. ఇక ఆ ఫోటోలో ఉంది.


 చిన్ననాటి రియల్ హీరో సోనూ సూద్. తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం రియల్ హీరోగా పరిచయం చేసుకుంది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం ఇంకా అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. చాలా మంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూ సూద్‌ను ఎంతగానో కదిలించారు. ఈ ఒక్క వ్యక్తి అడుగుని ముందుకేసి వందలాది మందికి భరోసాగా మారాడు.ఇప్పుడున్న స్టార్ నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తప్ప చాలా మంది రెమ్యునరేషన్‌కు, తమ పేర్ల వెనుక స్టార్లకు ఇచ్చే ప్రాధాన్యత.. పక్క వాడికి సాయం చేసే విషయంలో మాత్రం అస్సలు చూపించరు. అయితే వాళ్లంతా కేవలం వెండితెరపై హీరోలే కావొచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్‌లా ఎప్పుడూ రియల్ హీరోలు కాలేరు. సోనూ నటులనే కాదు ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినా చాలా పనులు తానొక్కడే చేసి ఏకంగా ఓ మినీ గవర్నమెంట్ నే నడిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: