టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలిం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు థియేటర్లో అంతగా సక్సెస్ అవ్వలేదు కానీ టీవీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతడు సినిమాలో తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఎక్కువ డైలాగులు లేకుండా స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఆకట్టుకున్నాడు. అంతేకాదు సినిమాలో మహేష్ పలికే డైలాగ్స్ కూడా చాలా స్ట్రైట్ గా ఉంటాయి. సినిమా చూసిన చాలా రోజుల వరకు డైలాగులు మన మైండ్ లోనే తిరుగుతూ ఉంటాయి. 

ఇక తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో మహేష్ టోటల్ డిఫరెంట్ షేడ్స్ తో కనిపిస్తాడు. సినిమాలో అతను డైలాగ్ చాలా ఫాస్ట్ గా చెప్తాడు. బాడీ లాంగ్వేజ్ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో డైలాగులు అంటే పంచులు ప్రాసలే ఉంటాయి అనుకున్న ఫ్యాన్స్ సినిమాలో మహేష్ డైలాగులు చూసి షాక్ అయిపోయారు. అలా అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్ క్యారెట్రైజేషన్ ని త్రివిక్రమ్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతోంది? మహేష్ క్యారెక్టర్ ను త్రివిక్రమ్ ఎలా డిజైన్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఏర్పడింది.

ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి డైలాగ్స్ చెపుతాడట. ఇందులో ఖలేజా ని మించిన మాస్ రోల్ లో మహేష్ కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ చేత త్రివిక్రమ్ కొన్ని బూతు డైలాగులు కూడా చెప్పించబోతున్నాడట. మహేష్ నోట బూతు డైలాగులు అంటే అది వేరే లెవెల్ మాస్. అంటే దీన్నిబట్టి మహేష్, త్రివిక్రమ్ మూవీ ఈసారి పక్కా ఊర మాస్ రేంజ్ లోనే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో మహేష్ సరసర పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: