బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

 పఠాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత షారుక్ "జవాన్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో షారుక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మే 2 వ తేదీన ఈ మూవీ యొక్క టీజర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ మూవీ యూనిట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ను 1 మినిట్ 54 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: