ఒకప్పుడు భారత చిత్రసీమ గా  చెప్పుకునే బాలీవుడ్ గత కొంతకాలంగా చెత్త సినిమాలను చేస్తూ వెనుకబడింది అని చెప్పాలి .ఎంతసేపటికి ప్రేమ కథ చిత్రాలను మాత్రమే తీస్తున్నారు ప్రయోగాత్మక సినిమాలను కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఈ మధ్య అడల్ట్ కంటెంట్ ని మరి పెంచేశారు. అందుకే కావచ్చు హిందీ సినిమాలకి మార్కెట్ అమాంతంగా పడిపోయింది. మొన్నే ఆ  మధ్యకాలంలో షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ సినిమాతో కాస్త ఊపిరి పోసాడు అని చెప్పాలి. దానికంటే ముందు కొన్ని ఏళ్ల నుండి బాలీవుడ్ ట్రాక్ రికార్డు కొంచెం కూడా బాగోలేదు. 

దీంతో హిందీ పరిశ్రమ సైతం దక్షిణాది సినీ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది .దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే హిందీ నటీనటులు తమ సినీ ఇండస్ట్రీపై మండిపడుతున్నారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ చెబుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు రణబీర్ కపూర్ సైతం ఆ నటీనటుల జాబితాలోకి చేరాడు. బాలీవుడ్ పై ఊహించని కామెంట్లను చేశాడు రణబీర్ కపూర్. తన అభిమానులతో ఇటీవల ముచ్చటించాడు. కేరళకు చెందిన ఒక ఫ్యాన్ హిందీ పరిశ్రమలో ఉన్న లోకం ఏంటి అని తనని ప్రశ్నించాడు.  ఆయన సమాధానం ఇస్తూ గత 15 నుండి 20 సంవత్సరాల వరకు సంస్కృతి ,రీమిక్స్ సినిమాల ప్రభావం వల్ల హిందీ పరిశ్రమలో గందరగోళాలు నెలకొన్నాయి అంటూ ఊహించని బాంబును పేల్చాడు.

దాంతోపాటు బాలీవుడ్ లో ఇప్పుడు చాలా తక్కువ మంది నటీనటులో ఉన్నారు. కొత్తవారికి ఎలాంటి అవకాశాలు లేవు అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఎంతో ముఖ్యమైనది.ఎందుకంటే దానివల్ల ఇండస్ట్రీలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. సినీ ఇండస్ట్రీలో కొత్తవారు అడుగుపెడితేనే కొత్త కథలు వస్తాయంటూ తెలిపాడు రణబీర్ కపూర్. ఇప్పటివరకు ఇలాంటిది బాలీవుడ్ ఇండస్ట్రీలో జరగలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటిది జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ వెల్లడించాడు.  అంతేకాదు ప్రస్తుతం చాలామంది అవకాశాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటూ చెప్పాడు.అలా కొత్తవారికి బాలీవుడ్ లో అవకాశాలు వస్తే ఖచ్చితంగా బాలీవుడ్ కి పూర్వ వైభవం వస్తుందని మళ్లీ కొత్తగా రూపుదిద్దుకుంటుంది అంటూ తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు రణబీర్ కపూర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: