ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా వచ్చి పట్టుమని 5 సంవత్సరాలు కూడా అవ్వ లేదు. తెలుగుసినిమా రంగం లో ఆమె ఇప్పటికే సీనియర్ హీరోయిన్ అయిపోయిందని ముద్రపడింది. ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. ఆశ్చర్యంగా ఉందా?ఇది నిజం. ప్రస్తుతం టాలీవుడ్ భాష లో ఒక హీరోతో రెండు సినిమాలు పూర్తి చేయడం అంటే సీనియర్ అయిపోయినట్టే లెక్క.! ఇప్పటికే ప్రభాస్ , అల్లు అర్జున్ , రవితేజ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీర్ వంటి ప్రముఖ హీరోలందరితోనూ కాజల్ సినిమాలు రెండేసి చేసింది.
దీనితో ప్రస్తుతం ఈ హీరో లు అంతా కాజల్ కు సీనియర్ అనే బిరుదు ఇచ్చేసారు . ఇక వారి పక్కన అవకాశాలు లభించేలా లేదు పరిస్థితి. ఒకే హీరో హీరోయిన్ల కాంబినేషన్ లోవరుసగా మూడు సినిమాలు అంటే చూసే జనాలకు కూడాలేరు, దీంతో కాజల్ ఇక టాలీవుడ్ నుంచి తట్టాబుట్టా సర్దే పరిస్థతి వచ్చింది అని అంటున్నారు. బాలీవుడ్ లో అయినా కాజల్ కు కలిసి వస్తుందను కుంటే అక్కడ కూడా ఆమె పరిస్థితి అంతంత మాత్రంగా నే ఉన్నది. ఆమె అక్షయ కుమార్ తో నటించిన ‘స్పెషల్ చబ్బీస్’ సినిమా కు మంచి పేరు వచ్చినప్పటికీ ఆ పేరు మొత్తం అక్షయ కుమార్ ఖాతాకు వెళ్ళి పోయింది కాని, కాజల్ కు ఏవిధంగా కలిసి రావడం లేదు .
అను కోకుండా ప్రస్తుత పరిస్థితి కాజల్ కు టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోను ఎక్కడా బాగాలేదు. క్రితం సంవత్సరం కోలీవుడ్ లో హీరో విజయ్ తో నటించిన తుపాకీ సినిమా హిట్ కావడంతో కాజల్ తన ఆశలన్నీ కోలీవుడ్ పైనే పెట్టుకుంది. అక్కడ తన సత్తా చాటుదాము అనుకుంటే హన్సిక, నయనతారల మధ్య పోటీలో నలిగి పోతోంది. ఈ పరిస్థితిలో ఎటువెళ్ళా లో తెలియక సతమతమోతోందట కాజల్...