కాజల్ అగర్వాల్ తన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మూవీలను ఏకకాలంలో మెయింటెన్ చేస్తూ వస్తుంది. స్వతాహాగా తెలుగు మూవీలే కాజల్‌కు పేరు తెచ్చపెట్టాయి. అందుకే బాలీవుడ్లో ఒకటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినా, తెలుగు మూవీలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది.
అజయ్‌దేవగన్ తో సింఘం, అక్షయ్‌కుమార్‌తో స్పెషల్ 26 మూవీలు నటించిన తరువాత బాలీవుడ్ కుర్ర హీరోల నుండి ఈ బ్యూటీకి చాలానే ఆఫర్లు వచ్చాయి. కాని చిన్నహీరోలతో చేయటానికి కాజల్ ఒప్పుకోవడం లేదంట. తన నెక్స్ట్ హిందీ మూవీను రణ్‌భీర్ కపూర్‌తో చేయాలని ఓ వీకెండ్ పార్టీకు వెళ్లినప్పుడు తన మనస్సులో మాటను చెప్పేసింది.
అప్పటి వరకూ తన చేతిలో ఉన్న టాలీవుడ్,కోళీవుడ్ ప్రాజెక్ట్‌లను త్వరగా ఫినిషే చేసే పనిలో పడింది. కార్తి,విజయ్‌లతో రెండు మూవీలను చేస్తుంది. అంతేకాకుండా రామ్‌చరణ్ ఎవడు, గబ్బర్‌సింగ్ సీక్వెల్లో ప్రత్యేక అతిథి పాత్రలను పోషిస్తుంది. ఈ మూవీలన్ని ఫినిష్ అయితే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌భీర్ కపూర్‌తో రొమాన్స్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.