రామ్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోల మాదిరి రామ్ సినిమా 100కోట్లు కలెక్ట్ చేయలేదు కదా.. అందులో సగం కూడా రాబట్టలేదు. పెద్ద హీరోల్లా భారీ ఓపెనింగ్స్ ఉండవు. కానీ.. వాళ్లెవరికి లేని రికార్డ్ రామ్ కు మాత్రమే సొంతం. తెలుగులో స్టార్ డమ్ లేకపోయినా.. రికార్డులు ఎలా క్రియేట్ చేస్తున్నాడో తెలుసా.. 

 

రామ్ సినిమా హిందీలో డబ్ అయితే.. యూ ట్యూబ్  పండుగ చేసుకుంటుంది. ఈ ఎనర్జిటిక్ హీరో నటించిన సినిమాలను డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే.. ఒక్కో చిత్రాన్ని 10కోట్లకు పైగా నెటిజన్లు చూశారు. వరుసగా నాలుగు సినిమాలు ఒక్కోటి 100 మిలియన్ వ్యూస్ దాటాయి. నేను శైలజ.. హలోగురు ప్రేమకోసమే హిందీ అనువాదాలైతే.. 200 మిలియన్ వ్యూవ్స్ కు దగ్గరవుతున్నాయి. 

 

నేను శైలజ హిందీ డబ్ వెర్షన్ తో రామ్ హవా మొదలైంది. నేను శైలజ హిందీలో ది సూపర్ కిలాడి 3 టైటిల్ తో యూట్యూబ్ లో రిలీజైంది. ఇప్పటి వరకు 190 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే ఈ సినిమాను 19కోట్ల మంది చూశారన్న మాట. 

 

ఇక్కడ ఫ్లాప్ అయిన రామ్ సినిమాలు హిందీలో హిట్టే. తెలుగులో ఆకట్టుకోలేకపోయిన ఉన్నది ఒక్కటే జిందగీని నెంబర్ 1 దిల్వాలే పేరుతో రిలీజ్ చేస్తే.. 15కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇక హలో గురు ప్రేమ కోసంను దూమ్ దార్ కిలాడీగా అనువదిస్తే 18కోట్ల మంది చూశారు. 

 

రామ్ సినిమాలు హిందీలో వరుసగా 100 మిలియన్ వ్యూస్ రావడంతో.. ఇస్మార్ట్ శంకర్ కోసం హిందీ జనాలు చాలా కాలం వెయిట్ చేశారు. రెండు నెలల క్రితం ఇస్మార్ట్ శంకర్ పేరుతోనే రిలీజ్ చేస్తే.. 10కోట్ల మంది చూసేశారు. ఇలా వరుసగా రామ్ హిందీ అనువాద సినిమాలు యూ ట్యూబ్ లో 100మిలియన్ మార్క్ దాటేస్తున్నాయి. ఈ రికార్డ్ తెలుగులో మరో హీరోకు లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: