అదుర్స్ అనగానే తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది రెండే రెండు పాత్రలు. ఒకటి చారి, రెండు బట్టు. 13 జనవరి 2010లో రిలీజైన ఈ సినిమా తెలుగునాట కితకితలు పెట్టింది. 20 కోట్ల పెట్టుబడితో నిర్మితమైన ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చారి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, బట్టు పాత్రలో బ్రహ్మానందం పోటా పోటీగా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. నయన తార, షీలా తమ అందాలతో కనువిందు చేసారు.

ఫస్ట్ టైం v v వినాయక్ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో శభాష్ అనిపించుకున్నాడు. వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను సమర్పించగా.. రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసారు. ఇంచుమించు 500 స్క్రీన్స్ లో రిలీజ్ చేసారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి తారక్ అదిరిపోయే స్టెప్స్ వేశారు. మొత్తంగా అదుర్స్ సినిమా ఆఖరికి అదుర్స్ అనిపించుకుని మొత్తం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది.

ఇకపోతే ఎన్టీఆర్ - వినాయక్ కాంబో కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చేస్తున్నారు. కాగా.. త్వరలో ఈ కాంబో షురూ కాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఇది అదుర్స్ కి సీక్వెల్ గా రాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ ఈ గాసిప్ నిజం కావాలని  జూనియర్ అభిమానులు తమ ఇష్ట దైవాలకు దండం పెట్టుకుంటున్నారు.

ఇక ఎన్టీఆర్ - వినాయక్ అనగానే మనకు గుర్తొచ్చే మరో సినిమా ఆది. ఎన్టీఆర్ కు ఇది రెండవ సినిమా కాగా 2002 లో విడుదలైన ఈ సినిమా తెలుగు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే ఎన్టీఆర్ ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఆదినే. అందుకే ఎన్టీఆర్ - వినాయక్ కాంబో అంటే నందమూరి అభిమానులకు మంచి గురి. అలాగే వినాయక్ అంటే ఎన్టీఆర్ కు ఎనలేని అభిమానం ఉంటుంది. ఇకపోతే సదరు కాంబినేషన్ షురూ కావాలని మనం కూడా గట్టిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: