ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. అగ్ర హీరోలు అందరూ ఇప్పుడు నిర్మొహమాటంగా ఈ బియోపిక్ లలో నటిస్తున్నారు.మన సమాజంలో ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు, అలానే చరిత్రలోనే ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన రాజల జీవిత చరిత్ర లను కథలుగా మలిచి..మంచి విజయాలు అందుకుంటున్నారు మన దర్శక నిర్మాతలు. మొదట్లో ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ ఇండ్రస్టీ లో కనబడేది. అలా ఇంతకుముందు బాలీవుడ్ లో తానాజీ 3డి హిస్టారికల్ కాన్సెప్టుతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ కొలువులో సైన్యాధ్యక్షుడిగా పని చేసిన తానాజీ అనే వీరసైనికుడి వీరగాధతో ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా ఛత్రపతి శివాజీ అజేయమైన వారియర్ స్టోరీతో ఎస్.ఎస్.రాజమౌళి సినిమా తెరకెక్కించనున్నారని గుసగుసలు స్ప్రెడ్ అయ్యాయి.

 ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ తరహా కథను లాక్ చేశారని రాజమౌళి తదుపరి చిత్రం ఇదేనని ప్రచారమవుతోంది.అయితే ఈ మూవీలో కథానాయకుడు ఎవరు? అంటే .. ఇప్పటికే మహేష్ హీరోగా రాజమౌళి సినిమా క్యూలో ఉంది. అంటే ఛత్రపతిగా నటించేది మహేష్ బాబు అని మరో ప్రచారం వేడెక్కిస్తోంది.అయితే ఇది నిజమా? అంటే ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ అయితే లేదు. చాలామంది ఈ న్యూస్ ని కొట్టి పారేసినా ..కొంతమంది మాత్రం ఇందులో వాస్తవం కూడా ఉండొచ్చు కదా అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఛత్రపతికి నార్త్ కనెక్టివిటీ ఉండడం..

 సౌత్ లోనూ పాపులారిటీ ఉన్న రారాజు కావడంతో మరో హిస్టారికల్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో మన రాజమౌళి  సంచలనాలు సృష్టించడం ఖాయమేనన్న చర్చా ఇప్పుడు ఇండ్రస్టీ లో వేడెక్కిస్తోంది.ఇక మరోవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఆ రేంజు సినిమా తీయడమే కరెక్ట్ అన్న వాదన కూడా తాజాగా తెరపైకొచ్చింది.మరి నిజంగా rrr తర్వాత రాజమౌళి.. మన మహేష్ బాబు తో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తే.. ఇక మహేష్ ఫ్యాన్స్ కి ఇక పండగే.. మరి ప్రస్తుతం ప్రచారమౌతున్న ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: