సోమవారం నామినేషన్స్ లో హంగామా ఓ రేంజ్ లో ఉంది. 12వ వారంలో అవినాష్, అరియానా, మోనాల్, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అఖిల్ తో గొడవ పడి మరి మోనాల్ సేఫ్ అయ్యేందుకు నిలబడగా కెప్టెన్ అయిన హారిక తన సపోర్ట్ తో అభిజిత్ ను సేఫ్ చేసింది. దాని వల్ల మోనాల్ మళ్లీ నామినేషన్స్ లోకి వెళ్లింది. ఫైనల్ గా వచ్చే వారం కూడా మోనాల్ సేఫ్ అయితే 12వ వారం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రిస్క్ లో పడే అవకాశం ఉంది.

అది ఎవరో కాదు అవినాష్ అండ్ అరియానా. అవినాష్ అరియానా ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు. అయితే అరియానా స్ట్రాంగ్ గా ఉండగా అవినాష్ హౌజ్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మోనాల్ కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. అఖిల్ ను నామినేట్ చేసినందుకు మోనాల్ కు అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు.

అయితే అవినాష్, అరియానా, మోనాల్ ల లెక్కలోకి వస్తే.. అవినాష్, మోనాల్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అరియానా సేఫ్ అయితే మోనాల్ కు ఎక్కువ ఓట్లు పడితే అవినాష్ బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాల్సిన అవకాశం ఉందని అంటున్నారు. మరి 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మాత్రం వీకెండ్ ఎపిసోడ్ నాడు తెలుస్తుంది.                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: