బిగ్ బాస్ సీజన్ 4లో బుధ, గురు వారాలు దెయ్యం టాస్క్ జరుగుతుంది. లక్సరీ బడ్జెట్ లో భాగంగా జరుగుతున్న ఈ టాస్క్ లో హౌజ్ మేట్స్ ను జలజ అనే దెయ్యం ఆటాడుకుంటుంది. దెయ్యం మాట వినగానే అరియానా భయపడిపోతుంది. అయితే ఈరోజు టాస్క్ లో భాగంగా కన్ ఫెషన్ రూం లో స్పూన్స్ ఉంచి ఒక్కొక్కరిగా వెళ్లి తీసుకు రమ్మంటుంది దెయ్యం. అయితే ముందు అరియానా పేరు చెప్పగా ఆమె ఒక్కతే వెళ్లలేదని అవినాష్ ను తోడుగా పంపించారు.

ఇక ఆ తర్వాత మోనాల్ ఒక్కతే వెళ్లి తన స్పూన్ తెచ్చుకుంది. ఇక సోహెల్, అఖిల్ ఇద్దరు జంటగా వెళ్లి దెయ్యానికి బుక్ అయ్యారు. కథ వేరే ఉంటదని వీర లెవల్ లో చెప్పి లోపలకు వెళ్లిన సోహెల్ ను ఆటాడుకుంది దెయ్యం. రకరకాల సౌండ్స్ తో సోహెల్, అఖిల్ లను ఆటాడుకుంది. అయితే లోపల ఓ రేంజ్ లో భయపడి బయటకు మాత్రం ఏమి జరగలేదు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అయితే సోహెల్ భయపడటం, కేకలు వేయడం విన్న హౌజ్ మేట్స్ వారిని ఆటపట్టిస్తున్నారు.

అంతేకాదు బయటకు వచ్చిన అఖిల్, సోహెల్ కెమెరా దగ్గరకు వెళ్లి ప్లీజ్ బిగ్ బాస్ ఈ వీడియో ఎవరికి చూపించకండి.. మా ఇజ్జత్ తీయకండి అని చెప్పారు. సోహెల్ మాత్రం ముందు రావో పోవే జలజ అని చెప్పి ఫైనల్ గా ఆమెకు బుక్ అయ్యాడు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో ఈ టాస్క్ తో ఆడియెన్స్ కు మంచి ఫన్ జెనరేట్ అయ్యింది.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: