తొలి చిత్రం 'చిత్రం' తోనే తేజ మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆ తర్వాత అండర్ రేటెడ్ లవ్ స్టోరీ లు చేసి ఆ తరహా సినిమాలకు ట్రెండ్ సెట్టర్ లా నిలిచాడు.. స్టార్ హీరోలుగా ఉన్నా ఉదయ్ కిరణ్, నితిన్ , గోపీచంద్ లను టాలీవుడ్ కి పరిచయం చేసింది తేజనే. అయితే వారు వెండితెరపై దూసుకుపోతుండగా తేజ మాత్రం ఇంకా చిన్న స్థాయి డైరెక్టర్ గానే మిగిలిపోయాడు. టాలెంట్ ఉన్నా హిట్ పడని, అదృష్టం లేని దర్శకులలో ఈయన ఒకరు..

తమ దగ్గర తగినంత టాలెంట్ లేకపోయినా తిమ్మి ని బమ్మి చేసి హిట్ కొట్టే డైరెక్టర్లు వస్తున్న ఈ రోజుల్లో టన్నులకొద్దీ టాలెంట్ ఉన్నా, సంవత్సరాల ఎక్స్ పీరియెన్స్ ఉన్నా తేజ మాత్రం అమావాసకో, పౌర్ణమికో హిట్ కొట్టి ఊరుకుంటున్నారు..  ఇటీవలే  రానా తో చేసిన నేనే రేజు నేనే మంత్రి సినిమా తో హిట్ కొట్టిన తేజ ఆ వెంటనే సీత రూపంలో డిజాస్టర్ ని ఇచ్చాడు.. ఆ సినిమా తర్వాత ఏ సినిమా ని మొదలుపెట్టని తేజ తాజాగా అయన పాత చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు..`చిత్రం`కి సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ల‌ను కొత్త‌వాళ్ల‌నే ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు.

అయితే.. ఈ సినిమాతో తేజ త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని టాక్‌. తేజ కి ఓ కుమారుడు, ఓ కుమార్తె. త‌న‌యుడి పేరు అమిత‌వ్ తేజ. న్యూయార్క్ లో చ‌దువుకున్నాడు. న‌ట‌న‌లోనూ శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. త‌న కోస‌మే తేజ‌.. `చిత్రం 1.1` తీస్తున్నాడ‌ని టాక్‌. హీరో త‌న ఇంట్లోంచి వ‌చ్చినా, మిగిలిన‌వాళ్లంద‌రినీ కొత్త‌వాళ్ల‌నే ఎంచుకోవాల‌ని భావిస్తున్నాడు అందుకోసం... ఆడిష‌న్స్ కూడా చేయ‌బోతున్నాడ‌ట‌. మ‌రి.. తేజ త‌న‌యుడి ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.‘చిత్రం’ సినిమాకు తన సంగీతంతో ఎంతో బలంగా నిలిచిన, ఒకప్పటి తన ఆస్థాన సంగీత దర్శకుడైన ఆర్.పి.పట్నాయక్‌‌ను ‘చిత్రం 1.1’ కోసం తేజ ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చనుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోస్టర్ మీద బేనర్ ఏదీ కనిపించలేదు. బహుశా తేజనే ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: