టాలీవుడ్‌లో ఒక‌రు మొద‌లు పెట్టిన ప‌నిని మిగ‌తా వాళ్లు ఫాలోకావ‌డం ఇది కొత్తేమీ కాదు. ఇప్పుడు మ‌న తెలుగు హీరోలు కూడా సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోలే కాదు డెబ్యూ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మ‌రైజ్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి యువహీరోలలో నాగశౌర్య ముందున్నాడు. ప్ర‌స్తుతం ఈ హీరో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఆయ‌న కెరీర్లో ఇప్పుడు 20వ సినిమా లక్ష్యస చేస్తున్నారు. దీన్ని ఆయ‌న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.

ఏకంగా ఈ మూవీ కోసం గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా ఎనిమిది పలకల బాడీ సర్ప్రైజ్ చేశాడు. జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందట. ఇప్పటికే టీజర్ తో ఈ మూవీ పై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. కాగా భార‌త్‌లోనే విల్లు విద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న మొద‌టి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మొద‌టి సారి శౌర్య విల్లు వీరుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ కోసం శౌర్య శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్ట‌పడ్డట్లు స‌మ‌చారం.


ఇప్పుడు తాజాగా జిమ్ లో వర్కౌట్ చేసి దిగిన ఓ ప‌వ‌ర్ ఫుల్ పిక్ ను షేర్ చేసాడు. ఆ ఫోటోలో శౌర్యను చూస్తే ఖచ్చితంగా ప్ర‌తి ఒక్క‌రూ ఫిదా అయిపోతారు. ఎందుకంటే సాలిడ్ బాడీ మేకోవర్ తో గతేడాది నుండి సర్ప్రైజ్ చేస్తున్నాడు మ‌న యంగ్ హీరో నాగ‌శౌర్య‌. ఇక ఆయ‌న కండలు తిరిగిన బాడీతో ఎయిట్ ప్యాక్ చూపి మ‌రీ నాగశౌర్య ప్రేక్షకులను ఎంట‌ర్ టైన్ చేస్తున్నాడు. అదేంటో గానీ గతేడాది నుండి వరుసగా సినిమాలు ప్రకటించి టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలుస్తూనే ఉన్నాడు మ‌న శౌర్య‌.

ఇక ఈ సారి మాత్రం స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టి 2020 హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్టులో టాప్ 5 లో నిలిచాడు శౌర్య‌. ఓవైపు లక్ష్య సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతూనే ఇంకోవైపు వరుడు కావలెను అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో నాగశౌర్య చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. లేడీ డైరెక్టర్ అయిన లక్ష్మీ సౌజన్య ఈ మూవీతో డెబ్యూ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: