స్టార్ సినిమా తీయాలంటే వందల కొద్దీ బడ్జెట్.. ఫారిన్ లొకేషన్లు.. భారీ సెట్టింగులు ఇవన్ని కంపల్సరీ.. సినిమా కథ కన్నా ఈ భారీ హంగులకే ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది. వీటితో పాటుగా హీరోల రెమ్యునరేషన్లు భారీగానే ఉంటాయి. అందుకే స్టార్ హీరోల సినీమ 150 కోట్లు వసూలు చేసినా బడ్జెట్ దాదాపు అంతే అయ్యిందని నిరాశపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమా అంటే మినిమం బడ్జెట్ 70 కోట్లు ఉండాల్సిందే. 70 కోట్ల బడ్జెట్ తో టార్గెట్ 100, 120 కోట్లు పెట్టుకుంటున్నారు.

అయితే చిన్న సినిమాల లెక్క వేరేలా ఉంది. వారికి అసలు బడ్జెట్ తో పనిలేదు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరో సినిమాకు ఒకరికిచ్చే రెమ్యునరేషన్ తో ఇక్కడ రెండు, మూడు సినిమాలు తీసేయొచ్చు. నూతన దర్శకులకు బడ్జెట్ తో పనిలేదు. తాము అనుకున్న కథ మాత్రమే ముఖ్యం. మొదటి ప్రయత్నం కాబట్టి తక్కువ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తారు. వారికి కథే బ్రహ్మాస్త్రం. బడ్జెట్.. కాస్టింగ్ ఇవన్ని సెకండరీ థింగ్స్. కథ పర్ఫెక్ట్ గా రాసుకుని దానికి తగినట్టుగా లో బడ్జెట్ లో సినిమాను ఫినిష్ చేస్తారు.

కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ కూడా సినిమాలను ఎంకరేజ్ చేస్తుంటారు. అందుకే ఈమధ్య చిన్న సినిమాల సందడి ఎక్కువైంది. బడ్జెట్ ఎంతైంది.. అందులో ఎవరు హీరో అన్నది చూడట్లేదు. సినిమా జానర్ ఏదైనా అది నచ్చింది అంటే చాలు చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కథకు అదనపు మెరుగులు దిద్దుతుంటే కొత్త దర్శకులు మాత్రం కంటెంట్ ను అలానే ప్రొజెక్ట్ చేస్తూ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. కథ బాగా రాసుకుని దాన్ని ప్రేక్షకులను మెప్పించేలా తీసిన ప్రతి సినిమా తెలుగులో తప్పక హిట్ అవుతుంది. దానికి ఈమధ్య వస్తున్న చిన్న సినిమాల విజయాలే ఉదహరణ.
 


మరింత సమాచారం తెలుసుకోండి: