సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా వరుస మూవీస్ చేస్తూ సత్తా చాటుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ సమంతలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మ్యారేజ్ తర్వాతే అమ్మడు హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్ చేయడం మొదలుపెట్టింది. అయితే మూవీస్ విషయంలో మాత్రం సమంత కాంప్రమైజ్ అవ్వట్లేదు. తనకు నచ్చిన కథలకే సమంత ఓటు వేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత ఖాతాలో కేవలం ఒక్క సినిమా మాత్రమే సెట్స్ మీద ఉంది.

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం మూవీ సెట్స్ మీఎద ఉంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోశిస్తున్న సమంత తన కెరియర్ లో మొదటిసారి మైథలాజికల్ మూవీలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినీమతో పాటుగా మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు టాక్. ఇదిలాఉంటే సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ కు తన పేరుని మార్చుకుంది. ఇదివరకు సమంత అక్కినేని ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పుడు జస్ట్ S అని మాత్రమే ఉంచింది. ఈ పేరు మార్చడానికి గల కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు.

స్టార్స్ విషయంలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. మరి సమంత పేరు మార్చుకోవడం వెనక కారణం ఏంటి ఒకవేళ నాగ చైతన్యతో ఏదైనా గొడవ జరిగిందా లేదా మరేదైనా బలమైన కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంత అక్కినేని కాస్త కేవలం S అని సామ్ పెట్టడం వెనక కారణం ఏమో కాని ఫ్యాన్స్ మాత్రం ఆమె తను పేరు మార్చుకోవడం పట్ల డౌట్ పడుతున్నారు. శాకుంతలం మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతుంది. ఈ మూవీతో సమంత అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: