అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన హేమా మాలినికి, ఒక నిర్మాత పిలిచి సాయం చేసి మరీ మొదటి సినిమా ఇప్పించాడు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది, హేమమాలిని స్టార్ అయింది. అప్పుడు తెలిసింది ఆమెకు, తనకొచ్చిన అవకాశం వెనుక ఒక స్టార్ హీరో ఉన్నాడని. కానీ,  ఆ స్టార్ ఎవరో ఆమెకు చెప్పలేదు ఆ నిర్మాత.  

హేమమాలిని మాత్రం ఎవరై ఉంటారు ఆ స్టార్ హీరో అని, తనకు తెలియని ఆతని పై  ప్రేమను పెంచుకుంది.  మరోపక్క ఆమె స్టార్ డమ్ ఆకాశానికి పాకింది.  అలా ఆమె ఎదగడానికి  హీరో ధర్మేంద్ర ప్రోత్సాహం ఎంతో ఉంది. కరెక్ట్ గా  అప్పుడే  తెలిసింది ఆమెకు,   తనకు మొదటి  అవకాశం ఇప్పించింది కూడా ధర్మేంద్ర అని

అంతే.. అతని ప్రేమలో దాదాపు రెండు సంవత్సరాల పాటు మరో లోకం తెలియకుండా  గడిపింది హేమా మాలిని. ఇద్దరు  వివాహానికి కూడా  రెడీ అయ్యారు.   కానీ హేమా మాలిని  తండ్రికి ఆ పెళ్లి  ఇష్టం లేదు. ఇద్దర్నీ విడదీయడానికి చాల చేశారు. పైగా అప్పటికే ధర్మేంద్రతో చేస్తోన్న  సినిమా షూటింగ్  సమయంలో కూడా   ఆయన  హేమమాలినితో  పాటు ఉండేవారు.  

హేమమాలిని - ధర్మేంద్ర అసలు కలవకుండా ఆయన మరీ కఠినంగా వ్యవహరించారు.   కానీ,  ధర్మేంద్ర - హేమమాలిని మాత్రం  చూపులతోనే ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఆ మైకంలో ఆకలి, అవసరాలు కూడా మర్చిపోయారు.  చివరకు  ఇద్దర్నీ  అలా చూడలేక   ఇరు కుటుంబాలు కూర్చుని   మొత్తానికి 'ధర్మేంద్ర - హేమమాలిని' పెళ్లి చేశారు. 

కేవలం చూపులతోనే పెద్దలను ఒప్పించిన ప్రేమ జంటగా ఈ స్టార్ కపుల్ బాలీవుడ్ లో  ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోయారు. పైగా పెళ్లి  తర్వాత కూడా ధర్మేంద్ర - హేమమాలిని జంట.. దాంపత్య జీవితంలో బెస్ట్ కపుల్స్ గానే నిలిచారు.  ఇప్పటికీ ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. ఒకరి కోసం ఒకరు అన్నట్టు  వారి జీవితం సాగుతుంది. అలాగే చివరి వరకు  హేమమాలిని - ధర్మేంద్ర  కలిసిమెలిసి ఉండాలని ఆశిద్దాం.        

మరింత సమాచారం తెలుసుకోండి: