డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో హీరోలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంటారు. క్లాస్‌ లుక్‌తో అదరగొడుతుంటారు. అయితే మెగాహీరోలని మాత్రం ఈ దర్శకుడు ఫుల్‌మాస్‌గా చూపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ని రగ్గడ్‌ లుక్‌లో ప్రజెంట్‌ చేసిన సుకుమార్..  చివరకు  స్టైలిష్‌ స్టార్‌ని కూడా ఊరమాస్‌గా మార్చేశాడు. మరి సుకుమార్‌ మెగాహీరోలని ఎందుకు రగ్గడ్‌ లుక్‌లోకి తీసుకెళ్తున్నాడనే సందేహాలు కలుగుతున్నాయి.

సుకుమార్‌కి 'వన్‌-నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' సినిమాల సమయంలో క్లాస్‌ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. 'జగడం' లాంటి మాస్‌ యాక్షన్‌ మూవీ తీసినా, క్లాస్‌ అనే ముద్ర పడింది. అయితే ఇప్పుడీ మార్క్‌కి భిన్నంగా కంప్లీట్ మాస్‌ మూవీస్‌ తీస్తున్నాడు. 'రంగస్థలం' నుంచి మాస్‌ మూవీస్‌ మేకర్‌గా మారిపోయాడు సుకుమార్. అల్లు అర్జున్‌కి స్టైలిష్‌ స్టార్‌ ఇమేజ్ ఉంది. 'అల వైకుంఠపురములో' అయితే ప్రతీ ఫ్రేమ్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. బన్ని కోసం ఫైట్లు కూడా స్టైల్‌గా కంపోజ్‌ చేశారు. అలాంటి స్టైలిష్‌ స్టార్‌ని కంప్లీట్‌గా మార్చేశాడు సుకుమార్. 'పుష్ప' సినిమాలో బన్నిని రగ్గడ్‌ లుక్‌లో ప్రజెంట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్స్‌లో బన్ని ఊరమాస్‌గా కనిపించాడు. ఈ రగ్గడ్‌ లుక్‌కి కూడా ఇదే లెవల్‌లో రెస్పాన్స్‌ వస్తోంది.

రామ్‌ చరణ్‌ మాస్‌ మూవీస్‌ చేసినా, ఈ హీరోని ఎవరూ రగ్గడ్‌లుక్‌లో చూపించలేదు. అయితే 'రంగస్థలం' సినిమాలో చరణ్‌ని ఎవరూ ఊహించని రేంజ్‌లో ప్రజెంట్ చేశాడు సుకుమార్. సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబు పాత్రతో కొత్త రామ్‌ చరణ్‌ని ఆవిష్కరించాడు. అంతేకాదు చరణ్‌ నుంచి సుకుమార్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌ని బయటకి తీసుకొచ్చాడనే ప్రశంసలు కూడా దక్కాయి. మొత్తానికి సుకుమార్ మెగా హీరోలను రఫ్ లుక్ లో చూపిస్తున్నాడు. అలాంటి వైవిధ్యమైన చిత్రాలతో.. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లుక్ తో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. తద్వారా మెగా హీరోలు సైతం ఊహించని స్థాయికి ఎదుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: