లేటెస్ట్ గా విడుదలైన తేజ్ సజ్జా మూవీ ‘మిరాయ్’ అంచనాలకు అనుగుణంగా మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తేజ్ సజ్జా కెరియర్ మరొక మెట్టు ఎదిగింది. ఈ సినిమాలో దర్శకుడు కార్తీక ఘట్టమనేని తయారు చేసుకున్న కథ మంచి గ్రాఫిక్స్ తొడవ్వడంతో ఈ మూవీ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. ఒక పద్ధతి ప్రకారం దర్శకుడు డివోషన్ యాక్షన్ మిక్స్ చేయదయంతో ఈమూవీకి సగటు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.


అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే యూత్ లో బాగా పాపులర్ అయిన పాట ‘వైబ్ ఉందిలే పిల్లా వైబ్ ఉందిలే’ ఈ మూవీలో మిస్ అవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈసినిమాలో ఈపాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ రెండు గంటల యాభై నిమిషాలు ఎదురు చూసిన సగటు ప్రేక్షకుడుకి నిరాశ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమూవీలో ఈపాట ఎక్కడో ఒకచోట వస్తుంది అని యూత్ విపరీతంగా ఎదురు చూశారు. తేజ సజ్జ రితిక వర్మ స్టెప్స్ కోసం ఎదురు చూసిన యూత్ కు నిరాశ మిగిలింది. ఈమూవీకి సంబంధించి టైటిల్ కార్డు నుంచి చివరి ఘట్టం దాకా ‘మిరాయ్’  ఒక పద్ధతి ప్రకారం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే ను నడిపించడంతో రెగ్యులర్ ఫార్ములా లో ఉండ లవ్ కెమిస్ట్రీ సాంగ్ లు పెడితే ఈమూవీలో సీరియస్ నెస్ తగ్గిపోతుందని దర్శకుడు బావిచడంతో ఈపాటను తీసివేశారు అని అంటున్నారు. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ జాన్వీ కపూర్ తో నటించిన దావూది పాటను ఈ మూవీ విడుదలైన రెండు వారాల తర్వాత సినిమాలో కలిపారు. అదే టెక్నిక్ ఇప్పుడు ఈ సినిమాకు కూడ అనుసరిస్తార అన్న సందేహం కలుగుతోంది. మరి రానున్న రోజులలో ఈ సందేహానికి సమాధానం దొరికే ఆస్కారం కనిపిస్తోంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: