ఒకప్పుడు బాలీవుడ్‌లో తన అందం, అభినయం, మేనరిజం, సింప్లిసిటీతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్పినప్పుడు, ప్రేక్షకుల కళ్లముందు నిజమైన స్టార్‌ హీరోయిన్ల నిర్వచనం ప్రత్యక్షమవుతుంది. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు భాషల్లోనూ తన ప్రతిభతో అద్భుత విజయాలు సాధించిన ఆమెను “ఎప్పటికీ గుర్తుండిపోయే లెజెండరీ నటి”గా ఇండస్ట్రీలో గుర్తించారు. అలాంటి మహానటి శ్రీదేవి కూతురుగా జన్మించిన జాన్వి కపూర్ మీద ప్రేక్షకుల అంచనాలు మొదటి రోజు నుంచే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్‌లోకి “ధడక్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వి, మొదట్లో తన ఇమేజ్ విషయంలో బాగా జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ కాలక్రమేణా ఆమె స్వభావం, ఆలోచనలు, తన అభిప్రాయాలు, సోషల్ మీడియా యాక్టివిటీ అన్నీ చాలా బోల్డ్ దిశలోకి మారిపోయాయి.


ఇటీవల జాన్వి కపూర్ ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె మాట్లాడుతూ,“సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేస్తే అందరూ దానిని తప్పుగా చూస్తారు. కానీ అసలు బోల్డ్ అంటే ఏమిటో సమాజం సరిగా అర్థం చేసుకోలేదు. ఎవరో అలా నటిస్తే వెంటనే విమర్శలు, తిట్లు మొదలవుతాయి. కానీ నేను అలా అనుకోను. ఒక నటిగా నాకు వచ్చే ప్రతి సీన్‌లో, ప్రతి భావంలో న్యాయం చేయడం నా బాధ్యత. ప్రేమ, కోపం, కన్నీరు, ఆనందం, బోల్డ్ సీన్స్ అన్నీ సినిమా భాగమే. వాటిని సిగ్గుగా చూడడం మన సమాజం తప్పు,” అని చెప్పింది.



ఆమె ఇంకా ఆమె మాట్లాడుతూ..“ఒక నటి అంటే అన్ని రకాల పాత్రల్లో నటించగలగాలి. ఒకే టైపు పాత్రలు చేస్తూ ఉంటే అది నటన కాదు, రొటీన్ మాత్రమే. ప్రేక్షకులు నిజమైన నటనను అర్థం చేసుకోవడానికి ముందు వాళ్ల ఆలోచనా విధానం మారాలి. నేను బోల్డ్ సీన్స్ చేయడం అంటే నాకు సిగ్గు లేదు, అది కూడా ఒక కళ భాగమే,” అని జాన్వి స్పష్టంగా వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు మంటలా వ్యాపించాయి. కొందరు ఆమె అభిప్రాయాలను పాజిటివ్‌గా స్వాగతిస్తూ, “ఇదే నిజమైన మోడర్న్ థింకింగ్, నటన అంటే బౌండరీలు లేని కళ” అని చెప్పగా, మరికొందరు మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.  “నీ తల్లి శ్రీదేవి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు సంపాదించిందో నీకు తెలుసా? ఆమె తన ప్రతిభతో, క్లాస్ నటనతో లెజెండ్ అయింది. కానీ నువ్వు మాత్రం బోల్డ్ సీన్స్ పేరు మీద ఆ పేరు చెడగొడుతున్నావు” అని విమర్శలు చేస్తున్నారు.



ఇక జాన్వి అభిమానులు మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. “జాన్వి కపూర్ ఓపెన్ మైండ్‌డ్ ఆర్టిస్ట్. తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలగడం ఆమె బలం” అని రిప్లైలు ఇస్తున్నారు. ప్రస్తుతం జాన్వి బిజీగా ఉన్న కొన్ని బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఆమె సినిమాలు క్రమంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు తెచ్చుకుంటున్నాయి. అయితే, సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ లుక్స్, ఓపెన్ స్టేట్‌మెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.ఎవరేమన్నా జాన్వి మాత్రం తన పంథాలోనే ముందుకు వెళ్తుంది. “నన్ను నన్నుగా అంగీకరించాలి, నేను ఎవరి షాడోలోనూ బ్రతకాలేను” అనే ఆత్మవిశ్వాసం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీదేవి లెజెండ్‌గా నిలిచింది, జాన్వి తన బోల్డ్ నడకతో కొత్తగా చరిత్ర రాయడానికి ప్రయత్నిస్తోంది.ఇది సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో కాలమే సమాధానం చెప్తుంది..??

మరింత సమాచారం తెలుసుకోండి: