తెలంగాణ రాష్ట్ర చూపు మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికపైకి మళ్లీంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఓవైపు మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంది. ఇంకోవైపు బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు ఫైనల్ అయిపోయింది. ఈ విధంగా ముక్కోనపు పోరులో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని చూస్తోంది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణించడం ఆయన భార్య కి టికెట్ ఇవ్వడం వల్ల ఆ సెంటిమెంట్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రచారం కూడా సాగిస్తోంది.

 ఇక్కడ విజయం సాధిస్తే మళ్లీ బీఆర్ఎస్ లో కొత్త ఊపు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు. అలాంటి ఈ టైం లో  కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. అయితే ఈయన ఇప్పటికే జూబ్లీహిల్స్ లో పలుమార్లు పోటీ చేసి ఓడిపోవడం తెలిసిన విషయమే. అలాంటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ప్రధానంగా మూడు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం..  నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజిలీస్ పార్టీ నుంచి పోటీ చేసి 41 వేల 656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 18,000 ఓట్లు సాధించారు. ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ లో పార్టీ లో చేశారు. ఈ విధంగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం నవీన్ యాదవ్ కు కలిసి వచ్చే అంశం.

ఇదే కాకుండా నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఆయనకు యూత్లో ఫాలోయింగ్ ఉండడం మరో విధంగా కలిసివస్తుంది.  ఇక ప్రధానంగా ఆయనకు మజిలీస్ పార్టీ నుంచి ముస్లింలంతా సపోర్ట్ చేయడం అనేది ఎంతోకాలంగా జరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో కూడా మజిలీస్ పార్టీ ముస్లింలంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇక ఇదే కాకుండా ఇంతకుముందు గెలిచిన వారంతా స్థానికేతరులే. కానీ ఈసారి నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నారు. ఇంకో అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం నవీన్ యాదవ్ కి కలిసొచ్చే అంశం. ఈ విధంగా నవీన్ యాదవ్ కు ఏ వైపు చూసుకున్న గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: