
ఇక బీహార్ రాజకీయాలలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు చిరాగ్ పస్వాన్. మిగతా నాయకుల పేర్లు ఎంత వినిపించినా, చిరాగ్ పస్వాన్ పేరు మాత్రం మరీ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. మొదట ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోదీ.. చిరాగ్ పస్వాన్ పార్టీకి 25 సీట్లకు మించి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని వార్తలు వెలువడ్డాయి. అలాగే సర్వేలు కూడా అదే సూచించాయి. అయితే పార్టీ మొదటి జాబితా విడుదల దశలో చిరాగ్ పస్వాన్ “మేము అనుకున్న సీట్లకు ఒక్క సీటు తక్కువ ఇచ్చినా, ఎన్నికల్లో పోటీ చేయం” అని స్పష్టంగా ప్రకటించారు.
దీంతో చివరికి మోదీ ఆయన కోరిన విధంగానే సీట్ల కేటాయింపు చేశారు. చిరాగ్ పస్వాన్ పార్టీకి ఏకంగా 29 సీట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచిన పార్టీకి ఈసారి 29 సీట్లు కేటాయించడం నిజంగా షాకింగ్‌గా మారింది. దీనిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సందర్భాల్లో చిరాగ్ పస్వాన్‌ను తెలుగు రాజకీయ నేత పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నారు. సాధారణంగా నరేంద్ర మోదీ ఎవరి మాట వినరు కానీ తెలుగు రాజకీయాల్లో ఆయన పవన్ కళ్యాణ్‌ను ప్రశంసిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన సజెషన్స్ తీసుకుంటారు. అదే విధంగా చిరాగ్ పస్వాన్ కూడా తన ధైర్యం, వైఖరితో బీహార్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తరహాలో ముందుకు వెళ్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో “ఏపీ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఎలాగో బీహార్ రాజకీయాలకు చిరాగ్ పస్వాన్ అలా” అని చెబుతూ, పవన్ కళ్యాణ్ పేరు అక్కడ కూడా హైలైట్ చేస్తున్నారు. ఈ పోలికతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఫీలవుతున్నారు. “మన అన్న కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా మారుతున్నారు” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.