డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల రామ్ పోతినేని, నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్ ని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అంతేకాదు రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ కావడం విశేషం. అసలు ఏమాత్రం హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమా పూరి కి చాలాకాలం తర్వాత మంచి కిక్ ఇచ్చే కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అంతేకాదు పూరి ఈజ్ బ్యాక్ అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకునేలా చేసింది ఇస్మార్ట్ శంకర్. దాంతో మళ్ళీ హీరోలందరు పూరి తో సినిమా చేయడానికి మళ్ళీ రెడీ అయిపోయారు. అయితే పూరి మాత్రం విజయ్ దేవరకొండను తన నెక్స్ట్ సినిమాకు హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు.  

ఇక ఈ మధ్య విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాకోసం రాత్రింబవళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాడు విజయ్. ఒకేసారి నాలుగు భాషల్లో నిర్మించారు. నెల రోజులకి పైనే ప్రమోషన్స్ చేశాడు విజయ్. తనవంతుగా ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ నిర్మాతలకు మాత్రం నష్టాలను మిగిల్చింది. ఇక ఈ సినిమా తర్వాత చేయాల్సిన సినిమాలు కూడా ఇంతవరకు పక్కా క్లారిటి లేదు. ఈ నేపథ్యంలో పూరి-విజయ్ కాంబినేషన్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 
 
అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా నిర్ణయించేశారని ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక వార్త బాగా హల్ చల్ చేస్తోంది. పూరి-విజయ్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఫైటర్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఫైటర్ టైటిల్ చాలా బాగుంటుందని భావిస్తున్నారట పూరి బృందం. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సినీ వర్గాలలో పుకారు షికారు చేస్తుంది.ఈ ఏడాది డిసెంబర్ వరకు సినిమా సెట్స్ పైకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: