యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న  బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్  సాధించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. పైగా అదే ఊపులో  సెకండ్ వీక్ లోకి కూడా ఎంటర్ అయింది ఈ యాక్షన్ థ్రిల్లర్. కానీ  ప్రస్తుతం సాహో కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి.  కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్  పర్వాలేదనిపిస్తున్నా... సినిమాని భారీ రేట్లుకు అమ్మడం వల్ల..  సాహో  బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.  మొత్తానికి ఈ సినిమా  రావాల్సినదానికి కంటే  ఎక్కువ చెడ్డ పేరునే సొంతం చేసుకుంది.   ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్  ప్రభాస్ స్టార్ డమ్ పై  పెద్ద దెబ్బె కొట్టింది.  తెలుగులో ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. ప్రభాస్ స్టార్ డమ్ తగ్గదు. కానీ మిగిలిన భాషల్లో అలా కాదు. సినిమా అట్టర్‌ ప్లాఫ్ అయితే.. ఆ ఎఫెక్ట్ ఆ సినిమాలో నటించిన హీరో మీద కాస్త ఎక్కువుగానే ఉంటుంది.  బాహుబలితో ప్రభాస్  ప్రపంచ రికార్డ్‌లను బద్దలు కొట్టి.. మిగిలిన బాషల్లో ప్రభాస్ అమాంతం స్టార్‌డమ్ ను  పెంచుకున్నాడు.  అయితే సాహో ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజీ చేసింది. ముఖ్యంగా  సాహో..  కథ పరంగా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి కథను పోలి ఉండడం.. పైగా అజ్ఞాతవాసి కూడా  ఓ ఫ్రెంచ్ సినిమాను కాపీ చేసి ప్లాఫ్ అందుకుంది.  అయినా ఇలాంటి స్క్రిప్ట్ పై  ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ సాహసం ఎందుకు చేసారో..?  ఏమైనా సాహో సినిమా ప్లాఫ్ ద్వారా ప్రభాస్ క్రేజ్ ఇప్పటికే తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ సోషల్ మీడియాని గమనిస్తే.. ఇప్పటికే సాహో పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.  


కానీ యూఎస్  బాక్సాఫీస్ వద్ద మాత్రం సాహో  కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్నాడు.  ఎట్టకేలకు రెండవ శనివారం నాటికి యూఎస్ లో  3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించింది ఈ సినిమా. దీంతో  ఈ చిత్రం,  'బాహుబలి 2' 12 మిలియన్,  బాహుబలి 6.9 మిలియన్, రంగస్థలం 3.5 మిలియన్ మరియు భరత్ అనే నేను 3.4  మిలియన్ ల జాబితాలో చేరింది. అదేంటో  టాక్ తో సంబంధం లేకుండా  యూఎస్ లో  మొదటి రోజు నుండి వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా.  అలాగే నైజాంలో కూడా, ఈ చిత్రం  మొదట 3 రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టేసింది.    కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా  ఈ చిత్రాన్ని  భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: