మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా" కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మొదటి స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలిజైన టీజర్, ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుంది.


అయితే ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి పెద్ద కారణం ఉందట. సెప్టెంబరు 22 వ తేదీకి, చిరంజీవి గారి జీవితానికి ఏదో సెంటిమెంటు ఉందట. ఆయన నటించిన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" ఇదే తారీఖున 1978లో రిలీజైంది. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పటికీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు అవుతుంది
.
అంతేకాక ఇక చిరంజీవి కెరీర్‌లో 100 వ చిత్రం అయిన  త్రినేత్రుడు కూడా సెప్టెంబర్ 22వ తేదీ 1988లో విడుదలైంది. త్రినేత్రుడు సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. చిరంజీవి ఇండస్ట్రీలోకి రావడం నుండి వంద సినిమాలు కంప్లీట్ చేసుకున్న తేదీ వరకు ఒకటే కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అదే తేదీన ఫిక్స్ చేశారట.


ఈ ఈవెంట్ ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కనివినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు. ఈ వేడుక కోసం పవన్ కల్యాణ్, కొరటాల శివ, రాజమౌళి, వీవీ వినాయక్ లతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ వేడుక తర్వాతనే అసలు ప్రమోషన్‌ను చేపట్టేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి ప్రమోషన్లు ఏ విధంగా సాగుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: