హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ ఘటన తర్వాత బాంబు అన్న మాట వింటేనే రాజధాని వాసులు భయంతో వణికిపోతున్నారు. దీంతో ఎక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.  అలాంటి ఘటనే సికింద్రాబాద్ సమీపంలోని ప్యారడైజ్ దగ్గర జరిగింది. ప్యారడైజ్ హోటల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న బాక్సు కలకలం రేపింది. బాక్సు అనుమానాస్పదంగా పడి వుండటంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో నిర్వహించారు. అయితే ఆతర్వాత ఎలాంటి ముప్పులేదని తేలిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: