నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి కీలకమైన రాజకీయ నాయకుడు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం రామనారాయణరెడ్డి 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గెలవడం జరిగింది.

Image result for anam ramanarayana reddy

అయితే ఈ క్రమంలో పార్టీలో సముచిత స్థానం దొరక్కపోవడంతో ఆశించిన గౌరవం అందకపోవడంతో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వేయడానికి రెడీ అయిపోయారు...ఈ క్రమంలో పార్టీని వేయటమే కాదు వెళుతూ వెళుతూ చంద్రబాబు కి షాక్ ఇవ్వాలని భారీగానే ప్లాన్ వేశారు ఆనం రామనారాయణరెడ్డి. ఈ క్రమంలో తన అనుచరులతో సమావేశం అయిన ఆనం టిడిపిలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి దక్కని గౌరవం గురించి అనుచరులతో పంచుకున్నారట.

Image result for anam ramanarayana reddy

అయితే తాజాగా ఇప్పుడు నియోజకవర్గంపై దృష్టిసారించాడు... తనతోపాటు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మొత్తాన్ని టీడీపీకి దూరం చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పావులు కూడా కదుపుతున్నారు.

Image result for anam ramanarayana reddy

ఇందుకోసం ప్రత్యేకంగా ఆయన ఆత్మీయ సమావేశం పెట్టి మరీ.. నియోజకవర్గంలోని కీలకనేతలను, కిందిస్థాయి నేతలను ఆహ్వానిస్తున్నారు. ఆ సమావేశానికి వచ్చిన వారందరినీ మెప్పించి.. తనతోపాటు వైసీపీలోకి చేర్చాలని చూస్తున్నారు. ఇదే జరిగితే చంద్రబాబుకి పెద్ద షాకే తగిలింది అని చెప్పవచ్చు. మరోపక్క సెప్టెంబర్ రెండో తారీఖున ఆనం రామనారాయణ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీలోకి రావడానికి రెడీ అయిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: