కరోనా వైరస్.. మనిషిలో మానవత్వాన్ని చంపేస్తుంది. మనిషికి మనిషికి సాయం చెయ్యాలి అనేది మరిపిస్తుంది. అస్వస్థతకు గురయ్యారు అంటే వారికీ ఎంత కుదిరితే అంత దూరం ఉంటున్నారు. పక్క ఇంట్లో మనిషి మరణించాడు అని తెలిసిన సరే కనీసం చూడటానికి కూడా వెళ్లడం లేదు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం చాలానే జరుగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ మహిళ చేసిన పని చూస్తే.. కరోనా ను ఇలా కూడా నివారించవచ్చ అని ఆశ్చర్యం వేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ మహిళ ఇల్లు వదిలి ఊరు బయట వచ్చేసి ఓ చెట్టు కింద కూర్చుంది. అనంతరం ఆ మహిళను అధికారులు ఆస్పత్రికి తరలించారు. 

 

IHG

 

ఈ ఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం రామన్నగారిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. రామన్నగారిపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ కొంతకాలంగా కడప జిల్లా రాజంపేట సమీపంలోని తూర్పుపల్లిలో ఉంటోంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురయ్యింది. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.               

 

దీంతో ఆమె ద్వారా కరోనా ఎవరికి సోకకూడదు అనే ఇలా చేసిందని వారి బంధువులు తెలిపారు. ఇంకా ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ కరోనా ను ఇలా కూడా నివారించవచ్చ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా వైరస్ భారత్ లో విలయతాండవం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన కోటి 46 లక్షలమంది పడ్డారు. అందులో 87 లక్షలమంది కరోనా నుండి కోలుకోగా 6 లక్షలమందికిపైగా కరోనా కు బలయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: