
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3,30,46,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 9,98,275 మంది మృతి చెందారు. అటు కోలుకున్న వాళ్లు కూడా 2,44,01,389 మంది ఉండగా, ఇటు మన భారత్‌లోనూ కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. నిన్న (శనివారం) కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదు కాగా, అత్యధికంగా 1,089 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 59,03,933 కు చేరాయి. ఈవార్తతో ప్రజల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది.
మనదేశంలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి కరోనాతో 93,379 మంది మృతి చెందగా, యాక్టివ్ కేసులు 9,60,969 ఉన్నాయి. ఈ వైరస్ బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్లు ఇప్పటి వరకు దేశంలో 48,49,585 మంది ఉన్నారు. అటు, అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. మరి దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని కోరుకుందాము.