ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విస్తృతంగా మారింది. ఈ సోషల్ మీడియావలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంత కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ట్రోలింగ్, నెగటివ్ పబ్లిసిటీలతో సెలబ్రిటీలకి పిచ్చెక్కుతోంది. తాజాగా అలాంటి అంశం మీదే హైదరాబాద్ పోలీసులను విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ నేత బోండా ఉమామహేశ్వర రావు హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


సోషల్ మీడియా లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రముఖ హోటల్ నుంచి హిరోయిన్ తో తాను బయటకు వస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు సోషల్ మీడియా పోస్టింగ్సుతో తనపై ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణల వల్ల తనపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తే అపకాశం ఉందని ఆయన తన ఫిర్యాదులో అభిప్రాయపడ్డారు. ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులకు ఫిర్యాదు ప్రతిని అందజేస్తున్న ఫొటోను బండా ఉమా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ నేత బోండా ఉమామహేశ్వర రావు హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 "తప్పుడు ఆరోపణలు చేయడం కాదురా జఫ్పా పేటీయం బ్యాచ్... దమ్మున్నోడిలా పోలీసులకు ఫిర్యాదు చేశా. మీ నాయకుడు అబిమాన జైలు అయిన చంచల్ గుడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. మేనేజ్ చేయడానికి ఏపీ పోలీసులు కాదు" అంటూ ఆయన తన పోస్టులో రాశారు. ఈ రోజుల్లో హీరోయిన్ లకు రాజకీయ నాయకులకు సంబంధాలు అంటూ విచ్చలవిడి గా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: