ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నియోజకవర్గం మొత్తం ఎన్నికల కోలాహలం మొదలైంది అని చెప్పవచ్చు. దీంతో హుజురాబాద్ పట్టణం లో ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దృష్టి సారించినది అని చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్నిక దేశవ్యాప్తంగా రాష్ట్రంలో చాలా రసవత్తరంగా సాగడంతో ఇంటెలిజెన్స్ విభాగం వారి అధికారులు అక్కడ మోహరించింది.  అయితే ఈటల రాజేందర్ తెరాస కు రాజీనామా చేసిన తర్వాత  నియోజకవర్గంలో జరిగే  పరిణామాలను  ఎప్పటికప్పుడు  నివేదికల ద్వారా రూపొందించుకున్నారు. సర్వేలు చేసుకున్నటువంటి పార్టీల  బలాలు మరియు బలహీనతలు  వారి ఉన్నతాధికారులకు అందిస్తున్నారు.

దీంతో హుజురాబాద్  ఎన్నిక ఆగస్టులోనే వస్తుందని అప్పుడే భావించి  భారీ స్థాయిలో సిబ్బందితో సర్వేలు కూడా చేశారు. కానీ అప్పుడు బెంగాల్ లో మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావడంతో  ఈ యొక్క నిఘా విభాగం అంతా రిలాక్స్ అయింది. ప్రస్తుతం హుజురాబాద్ లో నోటిఫికేషన్ విడుదల కావడంతో దాదాపు 100 నుంచి 150 మంది ఇంటిలిజెన్స్ విభాగాలు తన పని చేస్తున్నాయి. వీటితో పాటుగా ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి పొలిటికల్ విభాగమైన ఉన్నతాధికారులు  మూడు రిజియానులుగా ఏర్పడి వారి యొక్క సిబ్బందిని హుజురాబాద్లో దింపారు. దీనిలో భాగంగానే బిజెపి, తెరాస, కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీల యొక్క కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అధికారులకు అందిస్తున్నారు. పార్టీలు మరియు కులాలు వయసు  దీని ఆధారంగా ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే లో అడిగేఅటువంటి ప్రశ్నలను తయారు చేసుకున్నట్లు సమాచారం. వృత్తి, మతాలు, కులాలు, ఓటర్ల వయస్సు మరియు పార్టీల పరంగా మహిళల్లో కేటగిరీలో  ఇలా ప్రతి ఒక సర్వేలో  వారు ఆరు నుంచి ఏడు వేల మందిపై సర్వే నిర్వహించి వివరాలు సేకరించి ఎలా నిఘా విభాగాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే అధికార తెరాస పార్టీ  పథకాలు మరియు చేసిన అభివృద్ధి పనులు, కెసిఆర్ పనితీరు దళిత బంధువు  వంటి వాటిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే బిజెపి పార్టీ నుంచి దేశంలో అమలవుతున్న పథకాలు మరియు పెట్రోల్ ధరలు అభ్యర్థి  వ్యవహార శైలి, అసలు బిజెపి పార్టీ ఎందుకు ఓటు వేయాలి అనుకుంటున్నారు. అనే వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ ఇవ్వగలరా, రాష్ట్రంలో ప్రతిపక్షం ఎలా పనిచేస్తుంది.  అనే వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: