
ఇక ఇప్పటికే రష్యా, జార్జియా, న్యూజిలాండ్ లలో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రికార్డు స్థాయిలో అక్కడ కేసులు నమోదు అవటంతో మరోసారి లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి ఆయా దేశాలు. న్యూజిలాండ్ రాజధానిలో ఈ తరహా నిర్ణయాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. కేసులు పెరగటంతో లాక్ డౌన్ కూడా పొడిగించారు. ప్రారంభంలో కరోనా నుండి తప్పించుకున్నా, ఇప్పుడు డెల్టా వేరియంట్ మాత్రం ఈ దేశాన్ని కుదిపేస్తోంది. ఒకపక్క సరిహద్దులు మూయబడ్డాయి, దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది అయినా కేసులు మాత్రం తగ్గటం లేదు. అందుకే వాక్సిన్ ఒక్కటే మార్గం అని దానిని అందరికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆక్లాండ్ లో మొత్తం జనాభా 17 లక్షలు, అక్కడ పూర్తిగా లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు అధికారులు. ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
జార్జియా పరిస్థితి కూడా దాదాపుగా అంటే ఉంది. ఇక్కడ ఐదో వేవ్ తీవ్రంగా ప్రభావితం చూపుతోంది. ఒకపక్క అక్కడ అంటువ్యాదులు, మరోపక్క కరోనా తీవ్రంగా వేధిస్తున్నాయి. ముందస్తు జాగర్తలపై ప్రజలకు అధికారులు అనేక సూచనలు చేస్తూనే ఉన్నారు. రోజు ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఐదవ వేవ్ అనుకున్న దానికంటే తీవ్రంగా ప్రభావితం చూపుతుందని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.