
అధ్యక్షపీఠం అయితే దక్కించుకున్నారు బైడెన్, కానీ అనంతరం తాను కూడా కరోనా సందర్భాలలో ఏవిధంగా నిర్వహించాలనే దానిపై తడబడుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ట్రంప్ పై ఎటువంటి వ్యతిరేకత అయితే ప్రజలలో ఉన్నదో, అదే స్థాయిలో అంతకంటే ఎక్కువగా కూడా బైడెన్ పై వ్యతిరేకత వస్తుంది. రానురాను పెరిగిపోతుంది తప్ప తగ్గే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు. కరోనా కాస్త తగ్గినట్టు అనిపించగానే, కొత్త వేరియంట్ వచ్చి మళ్ళీ పరిస్థితిని మొదటికి తెచ్చేసింది. ఎందరో సంస్థల అధినేతలు కరోనా తో మృత్యువాత పడ్డారు. దానితో ఆయా సంస్థలను నడిపేవారు లేక ఉద్యోగాలు భారీగా కోత కోసేశారు.
ఉత్పత్తి తగ్గిపోయి, ఉగ్యోగులు అవసరమైనంతగా లేక అక్కడ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఉద్యోగాల కోత ప్రభావం కూడా ఆయా సంస్థలపై తీవ్రంగా ఉంది. మళ్ళీ ఉద్యోగాలలో చేరాలని సంస్థలు బ్రతిమిలాడినా వాళ్ళు ససేమిరా అంటున్నారు. దీనితో ఒకపక్క నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితులకు అన్నిటికి కారణంగా పౌరులకు కనిపించేది అధ్యక్షుడు బైడెన్ మాత్రమే. అందుకే ఆయనకు అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇప్పటికే పది శాతం కూడా అనుకూలత లేదనేది అనేక సర్వే లు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ అమెరికాపై తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. బైడెన్ అధికారంలోకి రావడానికి ఏదైతే కారణం అయ్యిందో అదే ఇప్పుడు ఆయన పదవికి కూడా గండం గా మారుతుంది. ఇవన్నిటిని ఆయన ఎలా చక్కబెడతారు అనేది తెలియాల్సి ఉంది, లేదంటే అతిత్వరగా మధ్యంతర ఎన్నికలు తప్పేట్టుగా లేవు.