భారత దేశంలో లోని చట్ట సభల్లో ఎగువ సభగా పేర్కోనే రాజ్యసభకు రాజ్యాంగం ప్రకారం ఉన్నతస్థానమే ఉంది. లోక్ సభలో బిల్లు  పాస్ అయిన తరువాత రాజ్యసభలో సభ్యులు ఆమోదం పొందితేనే అది రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి  ఆమోద ముద్ర వేసిన తరువాత ఆ బిల్లు చట్టమవుతుంది. రాజ్యసభను పెద్దల సభ అని కూడా పేర్కోనడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ దఫా రాజ్యసభ సమావేశాల్లో  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఆకాంక్ష నెరవేరేలా కనిపించడం లేదు. సభలో సభ్యుల హాజరు పెద్ద సంఖ్యలో ఉండాలని, వీలయినంత చర్చ రాజ్యసభలో జరగాలన్నది ఆయన అబీష్టం. అదే సమయంలో పెద్దల సభలో సభ్యులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన పదే పదే సూచిస్తుంటారు. ఎగువ సభలో సభ్యుల ప్రవర్తనను యావత్ భారత్ తో పాటు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుందని, మన నడవడికను బట్టి  , సభ్యుల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మన చట్టసభల గొప్పతనం రెట్టింపు అవుతుందని కూడా ఆయన చాలా సందర్భాలలో పేర్కోన్నారు.

ఈ శీతాకాలల సమావేశాలలో సభ్యుల హాజరు తక్కువగా ఉంది. హాజరైన వారు కూడా సమయాన్ని వృధా చేశారని రాజ్యసభ  గచివాలయ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు సస్పేండ్ కావడం.  సభ్యులు పదే పదే వాయిదా కోరుతుండటం కూడా సభలో సభ్యుల హాజరు తక్కువకు ఒక కారణం. రాజ్యసభ సమావేశాలు మూడో వారంలో  సభ్యుల హాజరు, సభా సమయాన్ని  సద్వినియోగం  37.60 శాతం మాత్రమే కావడం గమవార్హం. రాజ్యసభ సచివాలయం వివరాల ప్రకారం  మొదటి వారంలో 49.70 శాతం సమయం సద్వినియోగం కాగా, రెండో వారం 52.50 శాతం మాత్రమే ఉంది.

ఇక మూడవ వారంలో  మొత్తం 27 గంటల 11 నిమిషాల సమయం షెడ్యూల్ చేశారు.  12 మంది సభ్యుల సస్పెన్షన్ సమస్య కారణంగా పదే పదే అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా బలవంతంగా  సభ వాయిదా పడింది. ఈ కారణంగా అందుబాటులో ఉన్న సమయాన్ని 62.40 శాతం కోల్పోయింది. ఫలితంగా  10 గంటల 14 నిమిషాలు మాత్రమే సభ పనిచేసినట్లు అధికారులు పేర్కోంటున్నారు. శీతాకాల సమావేశాల మూడు వారాలలో ఇప్పటివరకు 81 జీరో అవర్ తో పాటు, 47 ప్రత్యేక ప్రస్తావనలు సభలో జరిగాయి.
లోక్‌సభ ఆమోదించిన నార్కోటిక్స్ డ్రగ్స్,  సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (సవరణ) బిల్లు, నేడు అంటే.. 2021  డిసెంబర్ 20 వతేది సోమవా రం పరిశీలనకు రానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: