
లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ సాయి రాజ్. ఉంటున్న గృహంపై సర్వ హక్కులు కలిగి ఉంటామని గమనించి మీ గృహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల నుండి తమ గృహాలలో నివాసం ఉంటున్నారని, కానీ.. ఆ గృహంపై సంపూర్ణ హక్కులు ఉండవన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్. అలాంటి గృహాలను నామినల్ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ గృహంపై సర్వ హక్కులు పొందాలని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ లబ్ధిదారులందరూ ముందుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన గృహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వివరించారు. ఈ పథకం పై గ్రామ స్థాయి నుండి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టాతో పాటు రిజిస్ట్రేషన్ జరుగుతుందని, ఆ గృహం పై సర్వ హక్కులు ఉంటాయని చెప్పారు.