గతంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగిన సమయంలో నాలుగు దేశాలతో కలిసి క్వాడ్ కూటమి ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ కూటమి లో భాగంగా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా లతోపాటు భారత్ కూడా సభ్యదేశంగా ఉంది. ఈ క్వాడ్ కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం చైనాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టడమే. సరిహద్దులోభారత్తో వివాదం పెట్టుకుంది చైనా.. అదే సమయంలో జపాన్ సరిహద్దుల్లో కూడా కొన్ని దీవులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక దక్షిణ చైనా మహాసముద్రం జలాలపై పూర్తి హక్కు మాదే అంటూ అమెరికా ఆస్ట్రేలియా లకు కూడా షాక్ ఇచ్చింది చైనా.



 ఈ క్రమంలోనే చైనాకు శత్రుదేశాల గా ఉన్నా జపాన్ భారత్ ఆస్ట్రేలియా అమెరికా దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చైనా ఆటలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక చైనా పై ఆధిపత్యం సాధించేందుకు నాలుగు దేశాలు ఒకరికి ఒకరుసహాయ సహకారాలుచేసుకునే విధంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. అయితే ట్రంప్ ఏర్పాటుచేసిన ఈ నాలుగు దేశాల కూటమి ఎంతో బలపడుతున్న సమయంలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రావడం తర్వాత ట్రంపు ఓడిపోయి బైడెన్ అధికారంలోకి రావడం జరిగింది. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాడ్ కూటమిని పూర్తిగా పక్కకు పెట్టేశారు.



 ఇలాంటి నేపథ్యంలో ఆ కూటమిలో ప్రస్తుతం సభ్య దేశాలుగా ఉన్న జపాన్ ఆస్ట్రేలియా ఒకటిగానే ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల జపాన్ ఆస్ట్రేలియా దేశాలు చైనా కు వ్యతిరేకంగా తమ స్నేహబంధాన్ని ప్రకటించాయి. అన్ని రకాల ఆర్థిక ఆయుధ సహకారాలు పరస్పరం సహాయం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవల ఆస్ట్రేలియా జపాన్ దేశాల ఒప్పందం కుదుర్చుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. రానున్న రోజుల్లో చైనాకు చెక్ పెట్టేందుకు ఈ రెండు దేశాలు కలిసి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: