ప్రపంచ చరిత్రలో భారత్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత్  గొప్పతనాన్ని ప్రపంచానికి తెలుపుతున్న డబ్ల్యూ హెచ్ సీ హిందీ భాషకు యూనిస్కో వెబ్ సైట్లో గౌరవ స్థానం కల్పించింది. భారత వారసత్వ కట్టడాల వివరాలను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్ లో హిందీలోనూ అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది యునెస్కో. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో లో భారత శాశ్వత ప్రతినిధికి ఈ విషయాన్ని తెలియజేశారు డబ్ల్యూ హెచ్ సీ డైరెక్టర్. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది యునెస్కో. ప్రపంచ వారసత్వ కేంద్రమైన వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్ లో భారత్ కు చెందిన వారసత్వ కట్టడాలు వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

 ఈమేరకు ప్యారిస్ లోని యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి కి తెలియజేసారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్. 2022 జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలను వర్చువల్ గా నిర్వహించారు. యునెస్కో లో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ విశర్మ భారత్ కు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక అంశాలు, దాని ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను, విశిష్టతను నొక్కి చెప్పారు. ప్రపంచ హిందీ దినోత్సవం వేడుకలకు విద్య, సామాజిక, సాంస్కృతిక, సమాచార ప్రసారాల విభాగాలకు చెందిన ప్రతినిధులు వీడియో సందేశాలు పంపారు. అలాగే అంగోలా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఈక్వెటర్, ఫ్రాన్స్, ఇరాక్, జపాన్, మంగోలియా, పాలిస్థినా, కొరియా, రష్యా శ్రీలంక, గ్రీస్, వియత్నాం లకు చెందిన యునెస్కో లో శాశ్వత  ప్రతినిధులు వీడియో సందేశాలు పంపించి హిందీ ప్రాముఖ్యతపై మాట్లాడారు.  యునెస్కోలో  హిందీ భాష చోటు సంపాదించుకోవడం పై చాలా మంది ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: