ఇంగ్షీషు మీడియంపై తెలంగాణ కీలక ప్రకటన  ?
వికారాబాద్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 12 అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.  అనంతరం విద్యార్థిని,విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు.పాఠశాలల పునః ప్రారంభం తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.ఇటీవలి నిర్వహించిన ఇంటర్ పరీక్షలు రానున్న వార్షిక పరీక్షలకు ఎంత గానో దో హద పడతా యని  అన్నారు మంత్రి సబితా  .ఇంద్రా రెడ్డి.    పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.  

మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చటానికి బృహత్తర ప్రణాళిక తో ముందుకు వెళ్తున్న ప్రభుత్వమని..  వికారాబాద్ కళాశాలలో 80 శాతం విద్యార్థినిలు ఉండటం విశేషం, బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం శుభ పరిణామమని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  ప్రతి ఒక్కరి జీవితంలో ఇంటర్ టర్నింగ్ పాయింట్,రెండు సంవత్సరాలు చాలా కీలకం....ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఏప్రిల్ లో జరిగే పరీక్షలకు ఇప్పటికే సిద్ధం కండి...లెక్చరర్లు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ కు డిగ్రీ కళాశాల,మెడికల్,నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసారు.జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  గా రికి ధన్యవాదాలు అన్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన కు ప్రభుత్వం శ్రీకారం చుట్ట నుం ద న్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: