ప్రశాంత్ కిశోర్ పేరుతో ఇంత కాలం న‌డిచిన రాజ‌కీయానికి ప్ర‌త్యామ్నాయ రూపం రానుంది. ఆయ‌న శిష్యుడు సునీల్ క‌నుగోల నుంచి స‌రికొత్త వ్యూహాలు కాంగ్రెస్ అంద‌నున్నాయి.అన్నీ బాగుంటే రేవంత్ అనుకున్న విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అందుకోవ‌డం ఖాయం.


ప్ర‌స్తుతం క్రియాశీల‌కంగా వినిపిస్తున్న ప‌దం పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్. ఈ ప‌దం చుట్టూనే రెండు తెలుగు రాష్ట్రాలూ తిరుగుతున్నాయి. గ‌తంలో ఈ ప‌దం  పెద్ద‌గా వాడుకలో లేక‌పోయినా, వైఎస్ జ‌గన్ గెలుపు అనంత‌రం బాగా పాపుల‌ర్ అయింది.ఆయ‌న ద‌క్కించుకున్న అనూహ్య విజ‌యంతో ప్ర‌శాంత్ కిశోర్ అలియాస్ పీకే పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌న అందించిన వ్యూహాలు కార‌ణంగా, ఆయ‌న న‌వ‌ర‌త్నాల పేరిట రూపొందించిన ప‌థ‌కాల కార‌ణంగా మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అనూహ్య విజ‌యం అందుకున్నారు.ఇప్పుడీయ‌న అటు తెలంగాణ రాష్ట్ర స‌మితికీ ఇటు వైస్సార్సీపీకీ సేవ‌లు అందించేందుకు సిద్ధం అవుతున్నారు.సానుభూతి రాజ‌కీయాలు నెర‌ప‌డంలో దిట్ట‌గా పేరున్న పీకే చాలా మంది కీల‌క నాయ‌కుల విజ‌యానికి కార‌ణం  అయ్యారు. మోడీ మొద‌లుకుని మ‌మ‌తా వ‌ర‌కూ ఆయ‌న మాటే విన్నారు. జ‌గ‌న్ మొద‌లుకుని కేసీఆర్ వ‌ర‌కూ ఆయ‌న మాటే వినేందుకు సిద్ధం అవుతున్నారు మ‌ళ్లీ!


ఇక పీక్కేకు దీటుగా రాజ‌కీయ కార్య‌క్షేత్రంలో సునీల్ క‌నుగోలు దిగుతున్నారు.తెలుగు మూలాలున్న‌ప్ప‌టికీ చెన్న‌య్ లో ఈయ‌న కుటుంబం స్థిర‌ప‌డింది అని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు స‌ల‌హాలు అందిస్తూ పీకేకు దీటైన వ్య‌క్తిగా ఆయ‌న రాణించ‌నున్నారు. గ‌తంలో ఈయ‌న కూడా పీకే టీంలో ప‌నిచేసిన ఉన్న‌త విద్యావంతుడు.ఆయ‌న‌తో  విభేదించి సొంతంగా ఎదిగే ప్ర‌య‌త్నాలు చేస్తున్న వాడు అని ప్ర‌ధాన స్ర‌వంతిలో ఉన్న మీడియా చెబుతోంది. ప్ర‌స్తుతం ఈయ‌న స‌ల‌హాలు,స‌న్నాహాలు ఏవిధంగా రేవంత్ ను ప్ర‌భావితం చేయ‌నున్నాయో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది.వాస్త‌వానికి జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ పార్టీకి స్ట్రాట‌జిస్ట్ గా ఉండాల్సిన పీకే కొన్ని కార‌ణాల రీత్యా ప‌నిచేయ‌లేక‌పోయారు.త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో పీకే వ్యూహాల‌ను తిప్పికొట్టేందుకు,కేసీఆర్ హ‌వాకు చెక్ పెట్టేందుకు ఎస్కేను రంగంలోకి దించుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs